మహిళా కాంగ్రెస్​ ఎగ్జిక్యూటివ్​ సమావేశం

మహిళా కాంగ్రెస్​ ఎగ్జిక్యూటివ్​ సమావేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‎లోని గాంధీభవన్‎లో ఆదివారం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‎కు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లక్షకుపైగా సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోనే తెలంగాణ మహిళా కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. దీంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావును అల్కా లాంబ అభినందించారు. సోమవారం గాంధీభవన్‎లో జరుగనున్న నారీ న్యాయ్ కార్యక్రమంపై కమిటీ  చర్చించింది.