ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్  కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హత: బీఈ/ బీటెక్‌‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం  ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000; ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టుకు రూ.15,00,000; ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 చెల్లిస్తారు.

సెలెక్షన్: అసెస్‌‌మెంట్, ఆన్‌‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మే 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు  ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150, మిగతా వారందరికీ రూ.750 చెల్లించాలి. వివరాలకు www.ippbonline.com వెబ్​సైట్​లో సంప్రదించాలి.