
వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 400
పోస్టులు: మెకానికల్ 150, కెమికల్ 60, ఎలక్ట్రికల్ 80, ఎలక్ట్రానిక్స్ 45, సివిల్ 45,
ఇన్ స్ట్రుమెంటేషన్ 20.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ లేదా బీఈ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 26 ఏండ్లు గరిష్ట వయోపరిమితి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏండ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ
(పురుషులు) అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళలు, ఎన్ పీసీఐఎల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్–2023, 2024, 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.