
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇచ్చి ప్రమోషన్లు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రూరల్ మండలం ధర్మాపూర్ హైస్కూల్లో క్యాలెండర్ను రిలీజ్ చేశారు. గత సర్కారు టెట్ నిర్వహించక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, కృష్ణయ్య, వెంకటేశ్వరమ్మ, ఎం శంకరయ్య, వి రాంబాబు, శాంతాబాయి, లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు.