కంప్యూటర్‌తో కుస్తీలు రోజురోజుకూ పెరుగుతున్నాయ్. ఉద్యోగమైనా..వ్యాపారమైనా గంటలకొద్దీ టైపింగ్ చేస్తున్నారు. దీంతో చాలామందిని మోచేయి, వేళ్ల నొప్పులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. అయితే, ఇంట్లో చిన్న చిన్న హ్యాండ్ స్ట్రెచెస్ చేస్తుంటే జాయింట్ పెయిన్స్‌కు చెక్ పెట్టొచ్చు.
రోజులో ఎనిమిది గంటలు కీ బోర్డుపై పనిచేస్తే కండరాలు పట్టేసే అవకాశం ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు చేతులకు రిలాక్సేషన్ ఇవ్వాలి.
స్ట్రెస్ బాల్స్ లేదా సింపుల్ ఎక్సర్‌సైజులు రెండు, మూడు గంటలకొకసారి చేయాలి.
గుప్పిట మూయడం, తెరవడం చేస్తే వేళ్ల నొప్పులు తగ్గుతాయి.
అరచేయిని వేళ్లతో పూర్తిగా మూసి వంద నెంబర్లు లెక్కపెడితే చేతిలో ఉండే కండరాలు యాక్టివ్‌గాఉంటాయి.
బొటనవేలితో చేతి వేళ్లను 25 సార్లు లెక్కపెట్టినా మొబిలిటీ పెరిగి నొప్పులు తగ్గుతాయి.
కుడిచేతి మోచేతిని ఎడమ అరచేతిలో పెట్టి రెండు నిమిషాలు రుద్దాలి. అలాగే కుడిచేయి అరచేతిపైనా రుద్దాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మోచేతి నొప్పులు తగ్గుతాయి.
వర్క్ చేస్తున్న టైంలో మధ్య మధ్యలో చేతులను టేబుల్ కిందకు వదలాలి. ఆ తర్వాత పైకి లేపాలి. అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల భుజాల నొప్పులు తగ్గుతాయి.
బొటన వేలును పైకిలేపి(థమ్స్ అప్ షేప్ లో) గుప్పిట మూయాలి. బొటనవేలును అటూఇటూ తిప్పాలి. ఇలా చేయడం వల్ల చేయి మొత్తం రిలాక్స్ అవుతుంది.
రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నట్టు చేయాలి. ఇలా రెండు నిమిషాలు చేతులను పైకి కిందకు చేయాలి. రోజుకి 2 సార్లు ఇలా చేస్తే నొప్పులు తగ్గి చేతులు రిలాక్స్ అవుతాయి.
For More News..