హైదరాబాద్ లోనే బడా ఎగ్జిబిషన్.. నుమాయిష్ మళ్లీ వచ్చేస్తుంది..!

హైదరాబాదీలు ఎంతగానో ఎదురు చూసే నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చేస్తోంది. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ బడా ఎగ్జిబిషన్ జనవరి 1, 2025 నుండి ప్రారంభం కానుంది. 46 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్ జనవరి 1 నుండి ఫిబ్రవరి 25, 2025 వరకు జరగనుంది. సుమారు 2వేలకు పైగా స్టాల్స్ తో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ను లక్షల సంఖ్యలో జనం సందర్శనచనున్నారు.

టికెట్ ధరలు, టైమింగ్స్:

జనవరి 1, 2025 ప్రారంభం కానున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ వీక్ డేస్ లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10: 30 గంటల వరకు ఉండనుంది. వీకెండ్స్, హాలిడేస్ సమయాల్లో సాయంత్రం 4 గంటల నుండి 11 గంటల వరకు ఉండనుంది. టికెట్ ధరల విషయానికి వస్తే.. ఈ ఏడాది టికెట్ రూ. 50గా ఉండనున్నట్లు సమాచారం. గత సంవత్సరం రూ. 40గా ఉన్న టికెట్ ధరపై రూ. 10 పెంచినట్లు తెలిపారు నిర్వాహకులు.

Also Read :- శ్రీశైలంలో శివదీక్ష విరమణ ప్రారంభం

స్టాల్స్ :

ఈ ఏడాదికి గాను స్టాల్స్ కోసం 2 వేల 500 అప్లికేషన్స్ వచ్చాయని.. వాటిలో 2వేల 200 స్టాల్స్ కేటాయించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో షాపింగ్ తో పాటు రిక్రియేషన్, రిలాక్సేషన్ వంటి ఏర్పాటు లక్షల మంది సందర్శకులను ఆకర్షించనున్నాయిని తెలిపారు. చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే పేరిట మహిళలకు, పిల్లలలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఎగ్జిబిషన్ కి వచ్చే సందర్శకుల భద్రత కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని.. సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పోలీసులు.