హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్‌గా పరిస్థితి మారింది. సంధ్య థియేటర్ ఘటనపై సినీ ప్రముఖులు వ్యవహరించిన తీరుతో ఆగ్రహానికి లోనైన రేవంత్ సర్కార్.. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పి టాలీవుడ్ పెద్దలకు బిగ్ షాక్ ఇచ్చింది. మొత్తానికి పుష్ప 2 మూవీ ఇష్యూ అటు సినీ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో దుమారం రేపుతోన్న వేళ.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్‌కు, సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. టికెట్ ధరలు భారీగా పెంచడం వల్లే ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా, అమెరికాలతో పోల్చితే ఇండియాలో థియేటర్స్ తగ్గుతున్నాయని.. టికెట్ రేట్లు పెంచడమే ఇందుకు కారణమని పేర్కొంది.
Also Read :- ఫిల్మ్ ఛాంబర్లో కీలక మీటింగ్
ధరల పెంపు వల్ల టాకీసుల్లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. మూవీ విడుదలైన నాలుగు వారాల తర్వాతైన ప్రేక్షకులు సినిమా చూస్తారు కానీ ధరల పెంపు వల్ల థియేటర్లో మూవీ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. టికెట్ రేట్ ఫిక్స్‌డ్‌గా ఉండటమే బెటరని.. అది మాకు కూడా చాలా మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది ఎగ్జిబిటర్స్ అసోషియేషన్. ఏపీలో కూడా తెలంగాణ మాదిరిగానే ఫిక్స్డ్ టికెట్ రేట్ పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ రిక్వెస్ట్ చేసింది.