లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి..రాష్ట్రాలవారీగా ఎగ్జిల్ పోల్స్ సంస్థలు తమ సర్వే రిపోర్టులను చెబుతున్నాయి.కేరళలో కాంగ్రెస్ కూ టమి అత్యధిక స్థానాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ (UDF) 19 సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబు తున్నాయి. యూడిఎఫ్ కు 17-19 స్థానాలు, ఎన్డీఏ కు 1-3 స్థానాలు రావొచ్చన సీఓటర్ సంస్థ అంచనా వేసింది. మరోవైపు యాక్సిస్ మై ఇండియా కూడా ఇదే అంచనా వెల్లడించింది. కాంగ్రెస్ 1314 సీట్లు, బీజేపీ 2-3, ఎల్డీఎఫ్ 1 స్థానం గెలుచుకుంటుందని చెబుతున్నాయి.
తమిళనాడులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. 37 ఔట్ ఆఫ్ 39
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించాయి. తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 37 స్థానాలు కాంగ్రెస్ కూటమి సాధిస్తుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే ఆరు సీట్లు కాంగ్రెస్ అదనంగా గెలుచుకుంటుందని తెలుస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 31, అన్నాడీఎంకే 1 , ఇతరులు 6 గెలుచుకున్నారు. మరో వైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు అధిక సీట్లు వస్తాయని సర్వేలు తేల్చాయి.