తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి చెరిసగం

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి చెరిసగం
  • ఎంఐఎంకు ఒక్క సీటు.. బీఆర్​ఎస్​కు వన్​ ఆర్​ నన్!

న్యూఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్​, బీజేపీ మధ్యనే లోక్​సభ ఎన్నికల పోరు జరిగినట్లు ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు చెప్తున్నాయి. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను ఎంఐఎం ఒక్క సీటును.. మిగతా 16 సీట్లలో కాంగ్రెస్​ సగం, బీజేపీ సగం సీట్లను గెలుచుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు తేల్చాయి. పదేండ్లు అధికారంలో ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్​ఎస్​ మాత్రం ఈ లోక్​సభ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశమే లేదని చాలా సంస్థలు లెక్క గట్టగా.. కొన్ని మాత్రం ఒక్క సీటు రావొచ్చని పేర్కొన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్​ 3, బీజేపీ 4, ఎంఐఎం 1, బీఆర్​ఎస్​ 9 సీట్లను గెలుచుకున్నాయి. 

కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ద్విముఖ పోరు నడిచిందని.. అది కాంగ్రెస్​, బీజేపీ మధ్యనేనని సర్వే సంస్థలు తెలిపాయి. పీపుల్స్​ పల్స్​ సంస్థ కాంగ్రెస్​కు 7 నుంచి 9 సీట్లు వస్తాయని.. బీజేపీకి 6 నుంచి 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎంఐఎంకు ఒక్క సీటు వస్తుందని పేర్కొంది. బీఆర్​ఎస్​కు ఒక్క సీటు రావొచ్చని, అది కూడా చెప్పలేమని తెలిపింది. ఆరా సంస్థ కాంగ్రెస్​కు 7 నుంచి 8 సీట్లు.. బీజేపీకి 8 నుంచి 9 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. బీఆర్​ఎస్​ పార్టీ  ఒక్క ఎంపీ సీటును కూడా గెలిచే అవకాశం లేదని ఆ సంస్థ అభిప్రాయపడింది. జనంసాక్షి సంస్థ బీజేపీకి 8 నుంచి 11, కాంగ్రెస్​కు 5 నుంచి 8 సీట్లు రావొచ్చని తెలిపింది. ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని.. బీఆర్​ఎస్​కు సున్న లేదా ఒక సీటు అని అంచనా వేసింది.  

ఎగ్జిట్​ పోల్స్​ (తెలంగాణ.. ఎంపీ సీట్లు: 17)

సంస్థ    కాంగ్రెస్​    బీజేపీ    బీఆర్​ఎస్​    ఇతరులు
                (ఎంఐఎం)
పీపుల్స్ పల్స్​    7 - 9    6‌‌ - 8     0 - 1    1
ఆరా    7 - 8    8 - 9    0    1
ఇండియా టుడే,
యాక్సిస్​ మై ఇండియా    4 - 6    11 - 12    0 - 1    1
జన్​ కీ బాత్​    4 - 7    9 - 12    0 - 1    1
సీ ఓటర్​     7 - 9     6 - 8    0 - 1    1
ఇండియా టీవీ సీఎన్​ఎక్స్​    6 - 8    8 - 10    0 - 1    1
జనంసాక్షి    5 - 8    8 - 11    0 - 1    1