హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 61 శాతం ఓటింగ్ నమోదు అయింది. 1027 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగియడంతో హర్యానా ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకే హర్యానా ప్రజలు పట్టం గట్టినట్లు చెబుతున్నాయి. హర్యానా అసెం బ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది.
పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. కాంగ్రెస్ 55, బీజేపీకి 26, ఐఎన్ఎల్డీకి 23, జేజేపీకి 01, ఇండిపెండెంట్లు 35 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాలి-.. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.
-
రిపబ్లిక్ మ్యాట్రిజ్ఎగ్జిట్ పోల్స్:
- కాంగ్రెస్:55–62
- బీజేపీ:18–26
- జేజేపీ: 0–3
- INLD: 3-–6
- ఇతరులు:2–5
దైనిక్ భాస్కర్ఎగ్జిట్ పోల్స్
- కాంగ్రెస్:44–54
- బీజేపీ:19–29
- జేజేపీ: 0–1
- INLD: 1–5
- ఇతరులు:4–9
CNN ఎగ్జిట్ పోల్స్:
- కాంగ్రెస్:59
- బీజేపీ:21
- జేజేపీ: 02
- INLD: 4
- AAP:0
Also Read :- హర్యానాలో ముగిసిన పోలింగ్..61 శాతంపైగా ఓటింగ్
కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థి బిజెపిపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
పీపుల్స్పల్స్నిర్వహించిన సర్వేల్లో..సీఎం అభ్యర్థిగా సీఎల్పీ లీడర్భూపీందర్ సింగ్హుడాను కోరుకున్నారు. హుడాకు 39శాతం మంది మద్దతుపలకగా..ఆ తర్వాత సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీ 28శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం,కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది మద్దతు పలికారు.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. హర్యానాలో ప్రధాన పోటీ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీలు బలహీనపడ్డాయి-. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు కీలకపాత్ర పోషించాయి. స్థానిక ఎమ్మెల్యే పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు ఓటు వేశారని -పీపుల్స్ పల్స్ వెల్లడించింది.
ఓటర్లు జాతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రధాని మోదీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించలేదు. నిరుద్యోగం, అగ్నీవీర్ పథకం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల..హర్యానాలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి-. పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా రాష్ట్రంలో రైతులు, రెజ్లర్లు, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.