మైహోమ్ మేనేజ్​మెంట్​తో ప్రాణహాని ఉంది: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్

మైహోమ్ మేనేజ్​మెంట్​తో ప్రాణహాని ఉంది: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ కుటుంబ సభ్యుల ఆరోపణ

శంషాబాద్, వెలుగు: మై హోమ్ సంస్థ యాజమాన్యంతో తమకు ప్రాణహాని ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నరసింహ భార్య ప్రేమలత, కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురువారం ముచ్చింతల్​లో వారు మీడియాతో మాట్లాడారు. 

పాలమాకుల నుంచి ముచ్చింతల్ రోడ్డు అభివృద్ధి గురించి మాట్లాడినందుకు కక్షతో తన భర్త అయిన చిలకమర్రి నరసింహపై గతంలో దాడిచేసి కారు ధ్వంసం చేశారన్నారు. శంషాబాద్ రూరల్ పీఎస్​లో మై హోమ్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అందుకు కక్ష సాధింపుగా తప్పుడు కేసు పెట్టించి బుధవారం అరెస్ట్ చేయించారన్నారు. 

దీంతో తాము బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని, తమకు ఎలాంటి హాని జరిగినా మై హోమ్ సంస్థ యాజమాన్యానిదే బాధ్యత అన్నారు.