![అమెజాన్ ఫార్మసీ సేవల విస్తరణ..ఇకపై దేశమంతటా మందుల డెలివరీ](https://static.v6velugu.com/uploads/2025/02/expansion-of-amazon-pharmacy-services-now-delivery-of-medicines-across-the-country_zKlpubysrB.jpg)
హైదరాబాద్, వెలుగు: మనదేశంలోని అన్ని పిన్‌కోడ్‌లకూ తమ ఈ–ఫార్మసీ ద్వారా మందులు డెలివరీ చేస్తున్నామని అమెజాన్ ఫార్మసీ తెలిపింది. లైసెన్స్డ్ సెల్లర్లు తమ మార్కెట్‌ప్లేస్ ద్వారా వీటిని సరఫరా చేస్తారని పేర్కొంది.
తాము తక్కువ ధరకు, ఎక్కువ వేగంతో మందులను అందిస్తున్నామని తెలిపింది. ప్రిస్క్రిప్షన్ మందులు, ఓటీసీ మందులు, వైద్య పరికరాలు, సప్లిమెంట్లు, ఆరోగ్య ఉత్పత్తులను అమెజాన్ ఫార్మసీ ద్వారా ఆర్డర్చేయవచ్చు. తన దేశవ్యాప్త లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి అన్ని ప్రాంతాలకూ ఒకే రోజులో డెలివరీ చేస్తున్నామని అమెజాన్ తెలిపింది.