చెన్నై: చెన్నైకి చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులను పండుగ గిఫ్ట్‌లతో ఆశ్చర్య పరిచింది. సర్మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. టాటా కార్లు, యాక్టివ స్కూటర్లు, రాయల్‌ఎన్‌ఫీల్డ్ బైక్‌లను 20 మంది ఉద్యోగులకు ఇచ్చామని ప్రకటించింది. ఉద్యోగులను మోటివేట్ చేసేందుకు ఈ గిఫ్ట్స్ ఇచ్చామని కంపెనీ ఎండీ డెంజిల్ రాయన్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.