
గద్వాల, వెలుగు: తుంగభద్ర డ్యామ్ ను సోమవారం నిపుణుల కమిటీ పరిశీలించింది. గతేడాది జరిగిన ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా డ్యామ్ గేట్ల రిపేర్ , భద్రతకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇందుకు తుంగభద్ర బోర్డు 7 గురు సభ్యులతో కమిటీని నియమించినది. దీనిలో సభ్య రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి ఒక్కొక్క అధికారిని సభ్యులుగా నియమించారు.
తెలంగాణ నుంచి జోగుళాంబ గద్వాల జిల్లా పీజేపీ ఎస్ఈ రహిముద్దీన్ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ టీబీ డ్యామ్ ను, గేట్లను పరిశీలించిన తర్వాత చర్చించామని, ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.