![సాగులో టెక్నాలజీని వాడాలి : డాక్టర్ సుబ్బా రావ్](https://static.v6velugu.com/uploads/2025/02/expert-emphasizes-technology-adoption-in-farming-for-improved-productivity_TQyOFvi4oh.jpg)
కాగజ్ నగర్, వెలుగు: రైతులు సాగులో టెక్నాలజీని వాడాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుబ్బా రావ్ అన్నారు. టాటా ట్రస్ట్ సహకారంతో విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కౌటాల మండల కేంద్రంలో రైతులకు శిక్షణ ఇచ్చారు. పర్భని శక్తి, జొన్న పంట, చిరుధాన్యాలపై ఇచ్చిన ట్రైనింగ్లో కౌటాల, ఆసిఫాబాద్, కెరమెరి మండల రైతులు పాల్గొన్నారు.
జొన్న పంట వేసే ముందు నాణ్యమైన విత్తనాల ఎంపిక, భూమి చదును చేసే విధానం, విత్తనాలు విత్తే విధానం, పంటలకు సోకే వ్యాధులు, నివారణ చర్యలు, దిగుబడి గురించి వివరించారు. ప్రోగ్రాం లీడర్ వాసు, మండల వ్యవసాయ అధికారి ప్రేమలత, విజయవాహిణి చారిటబుల్ పౌండేషన్ ప్రతినిధి పద్మాకర్, సభ్యులు పాల్గొన్నారు.