
Gold Price Fall: గడచిన ఏడాది కాలం నుంచి వాస్తవానికి పసిడి ధరలు భారీగా ప్రభావితం అవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులకు అందనంత ఎత్తుకు గోల్డ్ రేట్లు తక్కువ సమయంలోనే రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. అయితే ప్రస్తుతం భారతీయ పసిడి ప్రియలకు పండుగ లాంటి వార్త ఒకటి ఇక్కడ ఉంది. ఇంకెన్నాళ్లు ఇలా రేట్లు పెరుగుతాయి అని ఆందోళన చెందుతున్న చాలా మందికి ఒక శుభవార్త ఇక్కడ ఉంది. రానున్న కాలంలో గోల్డ్ 10 గ్రాముల రేటు రూ.55 వేల స్థాయికి పడిపోనుందని వెల్లడైంది.
వాస్తవానికి అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్ విలువ, సెంట్రల్ బ్యాంక్స్ నిర్ణయాలు వంటి అనేక అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తుంటాయని తెలిసిందే. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై పరప్సర టారిఫ్స్ ప్రకటిస్తూ వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోస్తున్న వేళ ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ బంగారంలోకి తమ డబ్బును తరలిస్తున్నారు. ఇదే సమయంలో సెంట్రల్ బ్యాంకులు సైతం తమ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా గోల్డ్ కొంటున్నాయి. ఈ పరిస్థితులు ఒక్కసారిగా పసిడికి డిమాండ్ పెంచాయి. అయితే దీర్ఘకాలంలో ఈ రేట్లు తిరిగి తగ్గుముఖం పట్టనున్నట్లు మార్నింగ్ స్టార్ నిపుణుడు జాన్ మిల్స్ అంటున్నారు.
ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు దాదాపు రూ.3వేలు నుంచి రూ.3వేల 150 మధ్య కొనసాగుతున్నాయి. రానున్న 5 ఏళ్ల కాలంలో ఇవి 38 శాతం వరకు పతనం అయ్యే అవకాశం ఉందని మిల్స్ తన అంచనాల్లో వెల్లడించారు. అయితే పసిడి ధరల పతనానికి దారితీసే మూడు వివిధ కారణాలను ఆయన ఈ క్రమంలో పంచుకున్నారు.
Also Read :- బెంగళూరులోని తెలుగు ఫ్యామిలీలకు షాక్స్
1. ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న అధిక పసిడి ధరలు మైనింగ్ వ్యాపారులను మరింత సప్లై చేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఇది భవిష్యత్తులో ధరలు తగ్గేందుకు దారితీస్తుందని మిల్స్ అన్నారు. మైనింగ్ కార్యక్రమాలు ఇటీవల పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించగా.. సగటున ఔన్సుకు మైనింగ్ సంస్థలు 950 డాలర్ల వరకు లాభాల మార్జిన్ చూస్తున్నట్లు వెల్లడైంది. దీనికి అదనంగా రీసైక్లింగ్ చేయటానికి వచ్చే పసిడి కూడా రానున్న రోజుల్లో గణనీయంగా పెరుగుతుందని మిల్స్ అభిప్రాయపడ్డారు.
2. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు మాత్రమే పసిడిని భారీగా కొనుగోలు చేస్తున్నారు.2024లో సెంట్రల్ బ్యాంకులు ఏకంగా 1వెయ్యి 45 టన్నుల బంగారం కొనుగోలు చేయటం గమనార్హం. కానీ ఆర్థిక వ్యవస్థల్లో పరిస్థితులు కుదుటపడితే ఇవి అమ్మకాలను చూస్తాయని తెలుస్తోంది. ఇదే సమయంలో డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు సైతం భారీగా పెరుగుతున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఇవి భవిష్యత్తులో భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గించవచ్చని తెలుస్తోంది.
3. ఇక చివరిగా పసిడి పరిశ్రమ చరిత్రను పరిశీలిస్తే ప్రస్తుతం ధరలు దాదాపు గరిష్ఠాలకు చేరుకుంటున్నట్లు మిల్స్ వెల్లడించారు.
చాలా మంది వాల్ స్ట్రీట్ నిపుణులు బంగారం ధరలు సమీప భవిష్యత్తులో పెరుగుతూనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ వారం బ్యాంక్ ఆఫ్ అమెరికా రాబోయే రెండేళ్లలో గోల్డ్ రేటు ఔన్సుకు 3,500 డాలర్లకు పెరగవచ్చని నివేదించింది. ఇది సగటున 10 శాతం రాబడిని అందించవచ్చని పేర్కొంది. గోల్డ్‌మన్ శాక్స్ కూడా తన అంచనాను ప్రకటిస్తూ ఏడాది చివరి నాటికి బంగారం 3,300 డాలర్లకు చేరుకోవచ్చని నివేదించింది.