Stock To Buy: 3 రెట్లు లాభమిచ్చే స్టాక్.. మీ దగ్గర ఉంటే అమ్మెుద్దు..! లక్షను కోటి చేసింది

Stock To Buy: 3 రెట్లు లాభమిచ్చే స్టాక్.. మీ దగ్గర ఉంటే అమ్మెుద్దు..! లక్షను కోటి చేసింది

Rajesh Exports Stock: చాలా కాలంగా కొనసాగుతున్న మార్కెట్ కరెక్షన్ ఇటీవల ముగింపుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ సూచీలు కొంత లాభాల స్వీకరణతో ఒడిదొడుకులకు లోనవుతున్నప్పటికీ.. కొన్ని స్టాక్స్ మాత్రం పెట్టుబడిదారులను ధనవంతులుగా చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే కొంత మార్కెట్ రీసెర్చ్ చేయటం ద్వారా మంచి రాబడులను అందించే స్టాక్స్ గుర్తించటం సులువేనని నిపుణులు చెబుతున్నారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ షేర్ల గురించే. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.184 స్థాయి వద్ద ముగిసింది. అయితే ఈ కంపెనీ షేర్లు రానున్న కాలంలో మూడు రెట్ల లాభాలను ఇవ్వగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్టాక్ కవర్ చేస్తున్న విశ్లేషకు కంపెనీ షేర్లకు స్ట్రాంగ్ కొనుగోలు రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.600గా పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న ధరకు ఇది దాదాపు 226 శాతం అధికం.

Also Read:-పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి 8 మార్పులు..

ఒక్కసారి కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధరను గమనిస్తే రూ.333గా ఉంది. ప్రస్తుతం నిపుణులు చెప్పినదాని ప్రకారం స్టాక్ రానున్న కాలంలో మంచి పనితీరును కనబరిస్తే ఇన్వెస్టర్లు దాని 52 వారాల గరిష్ఠానికి డబుల్ రేటుకు చేరుకుని లాభాలను అందుకోవచ్చని తెలుస్తోంది. 2025లో ఇప్పటి వరకు మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా కంపెనీ షేర్లు 20 శాతం మేర క్షీణతను చూడగా.. గడచిన ఏడాది కాలంలో స్టాక్ 36 శాతం తగ్గుదలను నమోదు చేసింది. 

వాస్తవానికి 2021లో కంపెనీ షేర్ల షేర్ ధర ఒక్కోటి రూ.2 వద్ద ఉంది. అప్పటి నుంచి కంపెనీ షేర్లు తమ పెట్టుబడిదారులకు దాదాపు 9 వేల శాతం రాబడిని తెచ్చిపెట్టింది. అంటే ఎవరైనా పెట్టుబడిదారుడు జూలై 6, 2021న కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారి పెట్టుబడి విలువ ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం రూ.90 లక్షలకు చేరుకుని ఉండేది. 

కంపెనీ వ్యాపారం.. 
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ 1989లో స్థాపించబడింది. కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ బంగారం వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతోంది. బంగారం రిటైల్, ఆభరణాల సుద్ధి వ్యాపారంలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. కంపెనీకి బెంగళూరులో పెద్ద తయారీ కేంద్రం కూడా ఉంది. 2015లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్  ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కర్మాగారమైన స్విట్జర్లాండ్‌లోని బాలెర్నాకు చెందిన వాల్కాంబిని 400 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ ఏటా 400 టన్నుల బంగారు ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.  

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.