ఏఐ గండం..డేంజర్లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు

ఏఐ గండం..డేంజర్లో  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు

 

  • 90 శాతం కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  రాస్తున్న  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఇంకో ఏడాదిలో అన్ని రకాల కోడింగ్ రాస్తుందంటున్న నిపుణులు
  • లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్ల అవసరం తగ్గిపోతుందని వెల్లడి

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో సాప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. 90 శాతం  కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఏఐ రాస్తోందని  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల అవసరం తగ్గిపోతుందని పేర్కొన్నారు. చాలా కంపెనీలు కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోసం ఏఐను వాడుతున్నాయి. తరచూ చేసే పనులను ఏఐ ఈజీగా చేస్తుందని జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు అన్నారు.  

కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన చాలా పనులను ఏఐ చేయగలుగుతుందని చెప్పారు. ప్రోగ్రామింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిపీటివ్ వర్క్‌ ఎక్కువగా ఉంటుందని, ఏఐ దీన్ని సమర్ధవంతంగా హ్యాండిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగలుగుతుందని వివరించారు. ఏఐతో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్ల అవసరం తగ్గిపోతుందని ఓపెన్ఏఐ సీఈఓ శామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనావేశారు. ఇప్పటికిప్పుడు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్ల డిమాండ్ తగ్గకపోవచ్చని, కానీ లాంగ్ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారిపోతుందని ఆయన వివరించారు.  టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే కొద్దీ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్ల అవసరం తగ్గిపోతూ వస్తుందని అన్నారు.  ఒకానొక దశకు చేరుకున్నాక చాలా తక్కువ మందే అవసరమవుతారని తెలిపారు.  ‘ఒకప్పుడు కోడింగ్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేర్చుకుంటే పోటీలో ముందుండేవాళ్లం. ఇప్పుడు ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నేర్చుకోవడం ముఖ్యమైంది’ అని ఆల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ పేర్కొన్నారు.

చాలా కంపెనీల్లో ఏఐతో కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

చాలా కంపెనీలు కోడింగ్ కోసం ఏఐ వాడుతున్నాయి. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లిష్టమైన కోడింగ్ పనిని ఏఐ చూసుకుంటుందని ఆల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా కంపెనీలు సాధారణ కోడింగ్ పనుల కోసం ఏఐని వాడుతున్నాయని అన్నారు. ఇంకో ఏడాదిలో అన్ని రకాలా సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏఐ రాయగలుగుతుందని  ఆంత్రోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ డారియో అమోడై  అంచనా వేశారు. తమ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కిలకమైన భాగాన్ని ఏఐ రాస్తుందని  ఈ ఏడాది జనవరిలో  మెటా సీఈఓ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.