
న్యూఢిల్లీ: ఏఐ వాడకం పెరుగుతుండడం, గ్లోబల్‌గా ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొనడంతో ఈ ఏడాది ఐటీ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెద్దగా పెంచకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. శాలరీ గ్రోత్ 4 శాతం నుంచి 8.5 శాతం మధ్య ఉండొచ్చని తెలిపారు.
ఉద్యోగుల స్కిల్స్‌ను బట్టి జీతాలను పెంచాలని ఐటీ కంపెనీలు చూస్తున్నాయి. చిన్న పట్టణాల్లో నియామకాలు జరుపుతున్నాయి. శాలరీలను పెంచడం కంటే బోనస్‌లు, ఈసాప్స్, ప్రాజెక్ట్‌కు తగ్గట్టు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై ఫోకస్ పెడుతున్నాయి. కాగా, గ్లోబల్‌గా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో ఐటీ కంపెనీల క్లయింట్స్ టెక్నాలజీ ఖర్చులను తగ్గించేస్తున్నాయి.