తెలుగు మీడియం రెస్టారెంట్​లో కాలం చెల్లిన జ్యూస్, మష్రూమ్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ లోని తెలుగు మీడియం రెస్టారెంట్ లో గురువారం జీహెచ్ ఎంసీ , ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయని బుధవారం జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందడంతో  రైడ్స్ జరిపారు.  కాలం చెల్లిన జ్యూస్, మష్రూమ్స్ వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. 

లేబులింగ్ లేకుండా రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌లో మసాల కలిపి పెట్టిన చికెన్, వెజ్, నాన్ వెజ్ వస్తువులను కూడా రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌లో కలిపి నిల్వ చేసినట్టు అధికారులు తెలిపారు. వీటిని సీజ్​ చేసి  ల్యాబ్ కు తరలించారు. రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.