గడువు దాటిన పాలు.. పురుగుపట్టిన పప్పు..

లింగంపేట, వెలుగు: మండలంలోని కన్నాపూర్​ తండా అంగన్​వాడీ కేంద్రంలో ఎక్స్పైరీ దాటిన పాలు.. పురుగు పట్టిన కందిపప్పు పంపిణీ చేశారు. తండాకు చెందిన గర్భిణి  దేవసోత్​ మౌనిక సోమవారం అంగన్​వాడీ సెంటర్​కు వెళ్లగా అంగన్​వాడీ నిర్వాహకురాలు రోజా గడువు దాటిన పాల ప్యాకెట్, పురుగు పట్టిన కందిపప్పు ప్యాకెట్ ఇచ్చారని వాపోయారు. పాలప్యాకెట్​ఎక్స్పైరీ డేట్​2023 మార్చి 2 ఉండగా, పప్పుకు ప్యాకెట్​లోనే పురుగు పట్టడంతో అవాక్కయ్యామన్నారు. ఇదేమిటని రోజాను ప్రశ్నించగా.. ఏప్రిల్​26న స్టాక్​ వచ్చిందని, తాను చూసుకోకుండా  ఇచ్చానని చెప్పారు. సూపర్​వైజర్​ స్వరూపరాణి ని ప్రశ్నించగా.. వెంటనే అక్కడికి వచ్చి అంగన్​వాడీ కార్యకర్త రోజాకు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు.