విద్యార్థులకు ఎక్స్ పైరీ అయిన రాగిజావా ప్యాకెట్లు.. పేరెంట్స్ ఆందోళన

జగిత్యాల జిల్లా కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలకు ఎక్స్ పైరీ అయిన రాగిజావా ప్యాకెట్లను అధికారులు సప్లయ్ చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు ఇమ్యూనిటీ పవర్ పెంచటానికి ప్రభుత్వం స్కూల్స్ లకు సప్లయ్ చేస్తోంది. అయితే కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన రాగిజావా ప్యాకెట్లు ఎక్స్ పైరీ కావడంతో పేరెంట్స్ మండిపడ్డారు.

మూడు రోజుల క్రితం(సెప్టెంబర్ 23) కొడిమ్యాల స్కూల్స్ లోకి అధికారులు సప్లయ్ చేసిన రాగిజావా ప్యాకెట్లు డేట్ ఎక్స్ పైరీ అయ్యాయి. ఈ నెల 18వరకే డేట్ ఉండగా వాటిని టీచర్లు ప్రతిరోజు విద్యార్థులకు అందజేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఎక్స్ పైరీ అయిన జావాను విద్యార్థులు తాగితే వారికి ఏమౌతుందో అని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Also Read :- సింగరేణి కార్మికులకు బోనస్..లాభాల్లో 32 శాతం వాటా

ఈ విషయంపై ఎంఈఓ శ్రీనివాస్ ను వివరణ కోరగా జావా ప్యాకెట్లపైన ఎక్స్ పైరీ డేట్ తప్పుగా ముద్రించారని..  మరో స్టిక్కర్ ముద్రించి అధికారులు సప్లయ్ చేశారని తెలిపారు. ప్యాకెట్లపైన అతికించిన స్టిక్కర్ ప్రకారం మరో నెల టైమ్ ఉందని తెలిపారు. పిల్లలకు అందించే ఫుడ్ విషయంలో కనీస జాగ్రత్తలు పాటించక పోవడం పట్ల పేరెంట్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.