మహిళ ప్యాంట్ బ్యాక్పాకెట్లో పేలిన సెల్ఫోన్.. వీడియో వైరల్

మహిళ ప్యాంట్ బ్యాక్పాకెట్లో పేలిన సెల్ఫోన్.. వీడియో వైరల్

సెల్ఫోన్ ఎంత ఉపయోగకరమో..అంత ప్రమాదకరమని ఈ ఘటన చెబుతోంది. నిత్య జీవితంలో సెల్ఫోన్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. పొద్దున లేచిన కానుంచి రాత్రి పడుకునే వరకు సెల్ఫోన్ మన శరీరంలో ఓ భాగం లెక్కన మనల్ని అంటుకుపోయి ఉంటుంది. సెల్ ఫోన్ కు అంతలా ఎడిక్ట్ అవుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని సెల్ ఫోన్లు పేలి ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. ఛార్జింగ్ పెడుతుండగా సెల్ ఫోన్ పేలి వ్యక్తులు చనిపోతున్నట్లు, తీవ్రగాయాలపాలవుతున్న ఘటనలు సోషల్ మీడియాలో , టీవీలు, పేపర్లలో చూస్తున్నాం..వింటున్నాం.. తాజాగా అలాంటిది ఓ ఘటనలో మహిళకు తీవ్రంగా గాయపడింది. ప్యాంట్ వేసుకున్న మహిళ బ్యాక్ పాకెట్లో సెల్ ఫోన్ పెట్టుకోగా..అది పేలింది..మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈఘటనకు సంబం ధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఓ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తున్న మహిళకు ఒక్కసారిగా మంటల అంటుకోవడం, మంటలార్పేందుకు ఆమె ఫ్రెండ్స్ ప్రయత్నించడం.. మహిళనుంచి ఒక్కసారిగా మంటలు రావడం చూసి అక్కడున్న జనం పరుగులు పెట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది.. ఎక్కడ జరిగిందో స్పష్టమైన వివరాలు లేవుగానీ.. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. 

ఈ వీడియోలు చూసిన నెటిజన్లు..ఇది దురదృష్టకరం..సెల్ ఫోన్ పేలిన భయంకరమైన సంఘటలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని.. తమకు జరిగిన అనుభ వాల్ని కూడా పంచుకున్నారు. టెక్నికల్ లోపమా, మరేదైనా లోపమో తెలియదు గానీ ఇటీవల కాలంలో సెల్ ఫోన్లలో పేలుడు సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయనేది వాస్తవం అంటున్నారు.