దేశంలోనే మొట్టమొదటి ఫ్రోజెన్​ జూపార్క్ ఎక్కడుందో తెలుసా?

దేశంలోనే మొట్టమొదటి  ఫ్రోజెన్​ జూపార్క్ ఎక్కడుందో తెలుసా?

పశ్చిమబెంగాల్​రాష్ట్ర డార్జిలింగ్​లోని పద్మజానాయుడు హిమాలయస్ జూలాజికల్ పార్క్(పీఎన్ హెచ్​జెడ్ పీ) మంచు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కనిపించే రెడ్​ పాండా, మంచు చిరుతలు, జాతుల డీఎన్ఏ నమూనాలను మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరిచే ఫ్రోజెన్​ను దేశంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేశారు. 

    

  • డీఎన్ఏ నమూనాలను భద్రపరచడం అనేది క్రయోజెనిక్ ప్రిజర్వేషన్ ఇనీషియేటివ్​లో భాగం. దీనిని పీఎన్ హెచ్​జెడ్​పీ, హైదరాబాద్​లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్​ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో ప్రారంభించింది.     
  • ముఖ్యంగా రెడ్​ పాండా, మంచు చిరుతలు, ఇతర జీవులు అంతరించిపోకుండా సంరక్షించడమే దీని లక్ష్యం.     
  •  ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన జూలాజికల్ పార్క్. ఇది మంచు చిరుత, రెడ్ పాండాల సంరక్షణ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది.     
  • ఫ్రోజెన్ జూ అనేది ఒక రకమైన జన్యు క్రయోబ్యాంక్. ఇది అంతరించిపోతున్న జంతువుల నుంచి డీఎన్ఏ, స్పెర్మ్, గుడ్లు, పిండాలను సేకరించి సురక్షితంగా జన్యు నమూనాలను –196 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు.    
  • వాటి జన్యు వైవిధ్యాన్ని కాపాడటమే ఫ్రోజెన్ జూ ప్రధాన ఉద్దేశం.  
  • జన్యు నమూనాలను ఉపయోగించి తిరిగి సంతానోత్పత్తి చేసేందుకు ఈ జూ ఉపయోగపడుతుంది.    
  • ప్రపంచవ్యాప్తంగా డజన్​కు పైగా ఫ్రోజెన్ జూలు ఉన్నాయి.     
  • ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రోజెన్ జూ 1975లో శాన్​ డియాగ్ లోని ఇన్​స్టిట్యూట్ ఫర్ కన్జర్వేషన్ రీసెర్చ్​లో కర్ట్​బెనిర్ష్యే స్థాపించారు. ప్రస్తుతం ఇది 800 నుంచి 8400 కంటే ఎక్కువ జంతువుల జన్యు నమూనాలను నిల్వ చేస్తుంది.