- మంచిర్యాల సమీపంలో క్వారీలో సఫారీ
- అడవిలో 3 గంటలు, 20 కిలోమీటర్లు జర్నీ
- ట్రాక్, మంచెలు ఏర్పాటు చేసిన అధికారులు
- సిక్స్ సీటర్ వెహికల్ ట్రిప్పుకు రూ.2వేలు చార్జి
- తీరొక్క పక్షులు.. వణ్యు ప్రాణులను చూసే చాన్స్
మంచిర్యాల, వెలుగు: చుట్టూ ఎత్తైన కొండలు.. పెద్ద పెద్ద చెట్లు.. కనుచూపు మేరలో పచ్చదనం.. ప్రకృతికే అందాలు అద్దినట్టు అతిపెద్ద కొలను.. అక్కడక్కడ నీటి కుంటలు.. ఇలా క్వారీ ఫారెస్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. పక్షుల కిలకిలలు. చెంగున ఎగిరే జింకలు. పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. తీరొక్క వన్యప్రాణులు చూపరులకు కనువిందు చేస్తాయి. మంచిర్యాలకు కేవలం ఆరేడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. ఇన్నాళ్లు వాటిని చూసే చాన్స్రాలేదు. ఇప్పుడా అవకాశాన్ని ఫారెస్ట్డిపార్ట్మెంట్ కల్పిస్తోంది. క్వారీలో ఏర్పాటైన జంగల్సఫారీ టూరిస్టులకు వెల్కమ్చెబుతోంది. ఈనెల14న సంక్రాంతి సందర్భంగా సఫారీని ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రోజుకు మూడు ట్రిప్పులు
కవ్వాల్ టైగర్జోన్పరిధిలోని పాత మంచిర్యాల, తిమ్మాపూర్, బొక్కలగుట్ట ఫారెస్టు బీట్ల పరిధిలో సఫారీ టూర్సాగుతుంది. ఇందుకు అడవిలో 20 కిలోమీటర్ల ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అడవి అందాలను, వన్యప్రాణులను చూసేందుకు అక్కడక్కడ మంచెలు వేశారు. అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి కుంటలు నిర్మించారు. వాటిని నింపేందుకు బోర్లు తవ్వించి సోలార్మోటార్లు అమర్చారు.
జంగల్సఫారీ క్వారీ వద్ద మొదలై గాంధారి ఖిలా వరకు వెళ్లి వెనక్కు వస్తుంది. సఫారీ కోసం ప్రస్తుతం రెండు వెహికల్స్ అందుబాటులో ఉండగా, మరో రెండు కొత్తవి ఆర్డర్ చేశారు. ఫస్ట్ట్రిప్పొద్దుట 6.30 నుంచి 9.30 గంటల వరకు, సెకండ్ట్రిప్9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మూడో ట్రిప్ 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉంటుంది. సిక్స్సీటర్వెహికల్ఒక్కో ట్రిప్పుకు రూ.2 వేలు చార్జి వసూలు చేస్తారు.
ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ లో వెళ్లొచ్చు
క్వారీ ఫారెస్టులో ఎన్నో రకాల పక్షులు, వన్యప్రాణులు ఉన్నాయి. నెమళ్లు, చుక్కల జింకలు, దుప్పులు, మెకం, సాంబార్, అడవి దున్నలు, అడవి పందులతో పాటు ఎలుగుబంట్లు, చిరుతలు, రేచుకుక్కలు వంటి వైల్డ్ యానిమల్స్సైతం కనిపించే చాన్స్ఉంటుంది. మంచిర్యాలలో ఆహ్లాద వాతావరణం లేకపోవడంతో గతంలో ఏసీసీ క్వారీలోని లేక్, పార్కు, దుర్గాదేవి టెంపుల్పిక్నిక్స్పాట్గా ఉండేది. గత కొన్నేండ్లుగా క్వారీ మెయింటెనెన్స్లేక అధ్వానంగా మారింది. ఇప్పుడు జంగిల్‌సఫారీ ద్వారా ఆ లోటు తీరనుంది. హాలీడేస్‌లో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి ప్రకృతి సోయగాలను ఆస్వాదించొచ్చు.
టైగర్మూమెంట్ కూడా..
ఇటీవల క్వారీ ఫారెస్టులో టైగర్మూమెంట్పెరిగింది. గత నవంబర్‌లో ఎస్12 మేల్ టైగర్ఇక్కడే నాలుగైదు రోజులు తిరిగింది. మేకల మందలు, పశువులపై దాడులు చేస్తూ పరిసర గ్రామాల ప్రజలను హడలెత్తించింది. అది పోగానే కెరమెరి వైపు నుంచి మరో ఫిమేల్టైగర్వచ్చింది. గత డిసెంబర్18న జంగిల్ సఫారీ ట్రాక్‌పై సీసీ కెమెరాల్లో ట్రాప్అయింది. ఇరవై రోజులుగా క్వారీ, గాంధారి ఖిలా, ర్యాలీ వాగు ప్రాజెక్టు ఏరియాల్లో సంచరిస్తోంది. వైల్డ్యానిమల్స్తారసపడే చాన్స్ఉన్నందున టూరిస్టులు అలర్ట్గానూ ఉండాలి.
20 కి.మీ ట్రాక్‌తో సఫారీ ఏర్పాట్లు
క్వారీలో జంగిల్సఫారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 20 కిలోమీటర్ల ట్రాక్‌తో పాటు జంతువులను చూసేందు కు మంచెలు వేశాం. అడవిలో అనేక రకాల బర్డ్స్, యానిమల్స్చూడొచ్చు. ఈనెల14న సంక్రాంతి నాడు ప్రారంభించనున్నాం. క్వారీ సఫారీ టూరిస్టులకు మెమోరబుల్టూర్గా మిగిలిపోతుంది. - అత్తె సుభాష్, లక్సెట్టిపేట ఎఫ్ఆర్వో