గుజరాత్ లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలో భారీ పేలుడు జరిగింది. సోమవారం ( నవంబర్ 11) రిఫైనరీలో స్టోరేజీ ట్యాంక్ లో మండలు చెలరేగడంతో ఈ పేలుడు సంభవించింది. కోయాలిలోని IOCL రిఫైనరీ లో పేలుడుతో దట్టమైన పొగలు వ్యాపించాయి. భయంతో కార్మికులు పరుగులు పెట్టారు.
సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రిఫైనరీలో బెంజిన్ నిల్వ చేసిన ట్యాంక్ లో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు , పొగ కమ్ముకుంది. పెట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ వర్గాలు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | మణిపూర్లో భీకర ఎన్కౌంటర్.. 11 మంది కుకీ తిరుగుబాటుదారుల హతం
2005లో కూడా IOC లోని FCC యూనిట్ లో జరిగిన అగ్ని్ప్రమాదంలో 13 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత 2010 జూన్ లో కూడా జీఆర్ ప్లాంట్ లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.