పాక్ మసీదులో పేలుడు.. ఐదుగురు మృతి

పాక్ మసీదులో పేలుడు.. ఐదుగురు మృతి

పెషావర్: రంజాన్ మాసం ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో దారుణం చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని ఓ మసీదులో శుక్రవారం జుమ్మా ప్రార్థనల సమయంలో శక్తివంతమైన పేలుడు సంభవించి ఐదుగురు మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ పేలుడులో జమియత్ ఉలేమా ఇస్లాం(జేయూఐ) చీఫ్, నౌషెరా జిల్లాలోని దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సా కేర్​టేకర్ హమీదుల్ హక్ హక్కానీ కూడా ప్రాణాలు కోల్పోయాడని ప్రధాన కార్యదర్శి షాహాబ్ అలీ షా ధ్రువీకరించారు.

1968లో జన్మించిన హమీదుల్ హక్ తన తండ్రి మౌలానా సమీ ఉల్ హక్ మరణం తర్వాత జేయూఐ(సమి గ్రూప్)కి అధిపతి అయ్యాడు. ఈ పేలుడును ఆత్మాహుతి బాంబు దాడిగా అనుమానిస్తున్నామని.. హమీదుల్ హక్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోందని ఖైబర్ పఖ్తుంఖ్వా ఐజీపీ జుల్ఫికర్ హమీద్ తెలిపారు. హమీదుల్ హక్‏‎కు తాము ఆరుగురు సెక్యూరిటీ గార్డులను నియమించామని ఆయన తెలిపారు.