యుద్ధం : లెబనాన్ బోర్డర్ నుంచి ఇరాన్ దాడులు : ఇజ్రాయెల్ సైనికులకు గాయాలు

లెబనాన్ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్పై భారీ ఎత్తున రాకెట్లతో దాడులు చేశారు హుజ్బుల్లా మిలిటెంట్లు. సోమవారం(ఏప్రిల్ 15)  తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వీరిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం (ఏప్రిల్ 14) తెల్లవారు జామున  వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొన్నట్లు వీడియోలు కూడా రీలిజ్ చేసింది. దాదాపు 300 డ్రోనలు, క్షిపణులను ఇరాన్ పేల్చినట్లు తెలిపింది. వీటిలో 99 శాతం ఆయుధాలను  అడ్డుకున్నట్లు ఇజ్రయెల్ తెలిపింది. అమెరికా,జోర్డాన్, బ్రిటన్ తోపాటు ఇతర దేశాల సహకారంతో ఆ దాడిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. 

అయితే తాజా సోమవారం తెల్లవారు జామున కూడా లెబనాన్ సరిహద్దుల నుంచి లెబనాన్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై రాకెట్లు మోత మోగించారు. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు.  మరోవైపు ఇజ్రాయెల్ పై దాడులను సమర్థించుకుంది. ఇజ్రాయెల్ దాడి ఇరాన్ ఆత్మ రక్షణ హక్కు అని పేర్కొంది.