స్కూలు సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం.. పరుగులు తీసిన విద్యార్థులు

స్కూలు సమీపంలో  పేలుడు పదార్థాలు కలకలం.. పరుగులు తీసిన విద్యార్థులు

బెంగళూరు సిటీలో ఇటీవల కాలంలో బాంబుల భయం పెరిగిపోయి. బాంబులు పెట్టి అనుకున్న టార్గెట్ ముగించుకుని సైలెంట్ గా తప్పించుకుంటున్నారు. దీనికి రామేశ్వరం కేఫ్ లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు కేసుఓ నిదర్శనం అని ప్రజలు అంటున్నారు. ఇటీవల పాఠశాలలు, పోలీస్ స్టేషన్లకు బాంబు బెదిరింపు ఫోన్లు రావడం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటక  రాజధాని బెంగళూరు లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌లో పోలీసులు వీటిని గుర్తించారు. అందులో జిలెటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లతోపాటు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించడంతో స్కూల్ లోని విద్యార్థులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.చిన్నారులు, వాళ్ల తల్లిదండ్రుల్లో ఆందోళనతో పరుగుతీశారు.ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించినట్లు తెలిపారు. ట్రాక్టర్‌ యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కొద్ది రోజుల క్రితం నగరంలో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

బెంగళూరు నగరంలోని కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్ బాంబ్ పేలుడు కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని బెళ్లందూరులోపి పాఠశాల ఆవరణం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో బెంగళూరు ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అయితే రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులోని ప్రధాన నిందితుడి ఆచూకీ ఇంకా చిక్కలేదని అధికారులు అంటున్నారు.

ALSO READ :- Family Star OTT: భారీ ధరకు ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రైట్స్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

 బెళ్లందూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, రవాణాపై ఆదారాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబ్ పేలుడు కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలోనే పాఠశాల ఆవరణం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం ప్రజల్లో మరింత ఆందోళన పెంచుతోంది. సంఘటనపై హై అలర్ట్ అయిన బెంగళూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.