భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు డంప్ చేసిన పేలుడు పదార్థాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా టిఫాగడ్ అడవుల్లో మావోయిస్టులు పేలుడు పదార్థాలు డంప్ చేశారన్న సమాచారంతో సీ-60, సీఆర్‌పీఎఫ్ బలగాలు అడవిలోకి వెళ్లాయి.
పేలుడు పదార్థాలు నింపిన ఆరు ప్రెషర్ కుక్కర్లు, మూడు డిటోనేటర్లు, మూడు క్లైమోర్‌మైన్స్, గన్ పౌడర్‌తో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్, మందులు, దుప్పట్లు గుర్తించి బాంబ్ స్క్వాడ్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. కూంబింగ్‌కు వచ్చే భద్రతాబలగాలపై దాడి చేసేందుకు ఈ పేలుడు పదార్థాలను డంప్ చేసినట్లు సమాచారం.