జూన్‌‌‌‌లో పెరిగిన గూడ్స్ ఎగుమతులు

న్యూఢిల్లీ : ఇండియా గూడ్స్ ఎగుమతులు కిందటి నెలలో 35.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కిందటేడాది జూన్‌‌‌‌తో పోలిస్తే 2.56 శాతం వృద్ధి నమోదు చేశాయి. ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌ (దిగుమతులు, ఎగుమతులు మధ్య తేడా) కూడా   జూన్‌‌‌‌లో 20.98 బిలియన్ డాలర్లకు పెరిగింది. కిందటేడాది జూన్‌‌‌‌లో ట్రేడ్‌‌‌‌ డెఫిసిట్ 19.19 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ ఏడాది జూన్‌‌‌‌లో గూడ్స్ దిగుమతులు  56.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

ALSO READ : తెలంగాణ మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ బ్లాక్​ ఎడిషన్​ 

 క్రూడాయిల్, ఎలక్ట్రానిక్‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌లు, పప్పుల దిగుమతుల పెరగడంతో జూన్‌‌‌‌లో మొత్తం దిగుమతులు 5 శాతం ఎగిశాయి.  ఈ ఏడాది మే నెలలో దేశ గూడ్స్‌‌‌‌ ఎగుమతులు 9.1 శాతం వృద్ధి చెంది 38.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అప్పుడు   ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌  ఏడు నెలల గరిష్టమైన 23.78 బిలియన్ డాలర్లను తాకింది.  మొత్తంగా ఏప్రిల్‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో గూడ్స్‌‌‌‌ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 5.84 శాతం పెరిగి 109.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు కూడా 7.6 శాతం పెరిగి 172.23 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.  ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌ 62.26 బిలియన్ డాలర్లుగా ఉంది.