- అక్టోబరులో 33.57 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు
- 31.36 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో మనదేశ సరుకుల ఎగుమతులు 6.21 శాతం పెరిగి 33.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 31.46 బిలియన్ డాలర్లను తాకింది. బంగారం దిగుమతుల పెరగడం వల్ల గత నెలలో దిగుమతుల విలువ 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్లకు చేరుకుంది. గోల్డ్ ఇన్‌బౌండ్ ఎగుమతులు 95.5 శాతం పెరిగి 7.23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఈ నెలలో చమురు దిగుమతులు కూడా 8 శాతం పెరిగి 17.66 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో వస్తువుల వాణిజ్య లోటు 26.31 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబరులో వాణిజ్య లోటు (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) పెరగడానికి దిగుమతులు ఎక్కువ కావడమేనని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సత్య శ్రీనివాస్ అన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–-అక్టోబర్ కాలంలో ఎగుమతులు 7 శాతం తగ్గి 244.89 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 8.95 శాతం తగ్గి 391.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడు నెలల కాలంలో వాణిజ్య లోటు 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 167.14 బిలియన్ డాలర్లుగా ఉంది.