ఎలక్ట్రికల్​ వైర్​ తెగి నిలిచిన ఎక్స్​ప్రెస్​ రైలు

కారేపల్లి,వెలుగు : రైల్వే ఎలక్ట్రికల్​ వైర్​ తెగడంతో సికింద్రాబాద్​‌‌..మణుగూరు ఎక్స్​ప్రెస్​ రైలు శనివారం కారేపల్లి రైల్వేస్టేషన్​లో మూడు గంటలపాటు నిలిచిపోయింది. సికింద్రాబాద్​ నుంచి బయల్దేరిన రైలు ఉదయం నాలుగు గంటలకు కారేపల్లి రైల్వేస్టేషన్​కు చేరుకుంది. కారేపల్లి రైల్వేస్టేషన్​ సమీపంలో విద్యుత్​ లైన్ వైర్​ తెగడంతో రైలును స్టేషన్​లోనే నిలిపివేశారు. 

హైదరాబాద్​లో ఉంటున్న కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాలకు చెందిన గ్రూప్​ 4 పరీక్ష రాసే యువతీయువకులు ఈ రైల్లో చాలా మంది ఉన్నారు. రైలు ఇక్కడ నిలిచిపోవడంతో వీరంతా రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. మూడు గంటలపాటు నిలిచి పోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.