గురుకులాల్లో అడ్మిషన్లకు గడువు పెంపు ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చు

గురుకులాల్లో అడ్మిషన్లకు గడువు పెంపు ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఈ నెల 6 దాకా అప్లై చేసుకోవచ్చని ఎస్సీ గురుకులాల సెక్రటరీ, ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ అలుగు వర్షిణి తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారంతో గడువు  ముగియగా, మరో 6 రోజులు పొడిగించినట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

వరుసగా సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. గురుకులాల్లో అడ్మిషన్లు పెంచేందుకు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రచార రథాల ద్వారా క్యాంపెయినింగ్​చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 51,968  సీట్లు  ఉండగా, శనివారం వరకు 1,46,394 అప్లికేషన్లు  వచ్చాయి. ఇందులో కేవలం ఐదో తరగతిలో అడ్మిషన్ల కోసమే 81,305 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.