BRఅంబేద్కర్‌ డిగ్రీ కోర్సులకు డిసెంబర్15 వరకు గడువుపెంపు

హైదరాబాద్ హయత్ నగర్  ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో.. డాక్టర్‌ BRఅంబేద్కర్‌ దూరవిద్య ద్వారా  కోర్సుల్లో చేరడానికి డిసెంబర్ 15వ, తేదీ వరకు గడువు పొడగించారు కాలేజీ నిర్వాహకులు. ఉన్నత విద్యను అందరికి అందుబాటులో ఉండేలా  విద్యార్థుల కోరిక ప్రకారం డిగ్రీ   కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ లోప్రవేశం పొందేందుకు  అపరాధ రుసుం రూ.200తో యూనివర్సిటీ అవకాశం కల్పించిందని తెలిపారు అధ్యయన కేంద్రం సమన్వయకర్త డాక్టర్  శంకర్. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో అడ్మిషన్లు పొందొచ్చని అన్నారు .డిగ్రీ లో ప్రవేశం పొందాలంటే ఇంటర్ ,ఓపెన్ ఇంటర్ ,ఐటిఐ రెండు సంవత్సరాలు,పాలిటెక్నిక్ లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు పొందాలన్నారు. అలాగే డిగ్రీ రెండవ, మూడో సంవత్సరం విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును ఫైన్  రూ.200లతో ఈనెల 15తేదీలోగా ఆన్లైన్లో  చెలించాలన్నారు. పూర్తి వివరాలకు 7382929771సెల్ నెంబర్ ని సంప్రదించాలని..లేదంటే నేరుగా కాలేజీని సంప్రదించవచ్చని చెప్పారు డాక్టర్  శంకర్.