హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశాలకోసం గడువు తేదీని పొడిగించింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. జూలై 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు అనుమతి ఇచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
జూన్ 28న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో పాస్ అయిన విద్యార్థులకు ఛాన్స్ ఇచ్చేందుకు ఈ గడువు తేదీని పొడిగించినట్లు బోర్డు తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ జనరల్,ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రక్రియ కొనసాగుతుంది. పదో తరగతి గ్రేడ్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తారు.
ఇంటర్ అడ్మిషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించింది. బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే చేరాలని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఉంచింది. వివరాలను చెక్ చేసుకుని అడ్మిషన్లు పొందాలని సూచించింది.