జూన్​ 5 వరకు స్పెషల్​ రైళ్లు పొడిగింపు

జూన్​ 5 వరకు స్పెషల్​ రైళ్లు పొడిగింపు

సికింద్రాబాద్, వెలుగు :  వేసవిలో ప్యాసింజర్ల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో నడుస్తున్న పలు స్పెషల్​రైళ్ల సర్వీసును పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.  వివిధ మార్గాల్లో నడుస్తున్న  22 స్పెషల్​ ట్రైన్లు ఈ నెల 13 నుంచి జూన్​5 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. చెన్నై~ ఇగ్మోర్~​​-సంత్రగచ్చి, చెన్నై సెంట్రల్~​-భువనేశ్వర్, కోయంబత్తూర్​~-భగత్​కీ కోఠి, ఎర్నాకులమ్~​-భ్రహ్మపూర్, కాలా బురాగీ~బెంగుళూరు

 నాగర్​సోల్​~-డిబ్రుగర్ మధ్య ప్రత్యేక రైళ్లు జూన్​ 5 వరకు నడుస్తాయని, ఈ సదుపాయాన్ని ప్రయాణీకులు వినియోగించుకోవాలని సూచించారు. వీటితో పాటు ఈ నెల 11 నుంచి మే 1 వరకు  కాచిగూడ-~ తిరుపతి, సికింద్రాబాద్​~-రామనాథపురం, సికింద్రాబాద్~​-నర్సాపూర్ రైళ్ల సర్వీసులను కూడా పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో  పేర్కొన్నారు.