డిసెంబర్ 5 వరకూ టెన్త్ ఎగ్జామ్  ఫీజు గడువు పెంపు : కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించిన పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5 వరకూ పొడిగించామని  ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించే అవకాశం ఉంది. అయితే,  విద్యార్థులు, టీచర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో వచ్చే నెల 5 వరకూ పొడిగించినట్టు చెప్పారు.

రూ.50 ఫైన్​తో డిసెంబర్ 12 వరకూ, రూ.200 ఫైన్​తో డిసెంబర్ 19 వరకూ, రూ.500 ఫైన్​తో డిసెంబర్ 30 వరకూ ఫీజు చెల్లించే చాన్స్ ఉందని పేర్కొన్నారు. టెన్త్ రెగ్యులర్ స్టూడెంట్లకు రూ.125 మాత్రమే ఫీజు ఉంటుందని వెల్లడించారు.