
సికింద్రాబాద్, వెలుగు: ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సురేశ్ కుమార్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ప్రొఫెసర్ సురేశ్ కుమార్ ఇఫ్లూ వీసీగా ఆరేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వశాఖ ఏడాదిపాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే పొడిగించిన పదవీకాలం కూడా ఈనెల 23తో ముగిసింది. దీంతో వర్సిటీకి కొత్త వీసీ నియామకం జరిగే వరకూ సురేశ్కుమార్నే కొనసాగిస్తూ ఈ నెల15నే కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సురేశ్కుమార్తన పదవీ కాలం ముగిసినా వీసీగా కొనసాగుతున్నారని ఇఫ్లూ విద్యార్థులు ఆరోపించారు. ఈక్రమంలో వీసీ పదవీ కాలం పొడిగింపు విషయాన్ని అధికారులు వెల్లడించారు.