పాకిస్తాన్​కు​ జైశంకర్... ఎస్​సీవో కాన్​క్లేవ్​కు హాజరు

పాకిస్తాన్​కు​ జైశంకర్... ఎస్​సీవో కాన్​క్లేవ్​కు హాజరు

ఇస్లామాబాద్: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్​సీవో) కాన్​క్లేవ్​లో పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్ శివారులోని నూర్ ఖాన్ ఎయిర్​బేస్​లో దిగిన ఆయనకు అక్కడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ను జైశంకర్ కలిశారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు ముచ్చటించారు.

ఎస్​సీవో సభ్యదేశాల ప్రతినిధుల కోసం షెహబాజ్‌‌ షరీఫ్‌‌ తన నివాసంలో మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. దీనికి జైశంకర్​తో పాటు ఆయా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. బుధవారం, గురువారం ఎస్​సీవో సదస్సు జరగనున్నది. వాణిజ్యం, ఆర్థిక అంశాలే ఎజెండాగా ఏడాదికోసారి ఎస్​సీవో సదస్సు నిర్వహిస్తారు. ఇండియా బృందానికి జైశంకర్‌‌ నేతృత్వం వహిస్తారు. మరోవైపు ఈ సదస్సులో చైనా, రష్యా ప్రధానులు కూడా పాల్గొననున్నారు.