యూఎస్ చరిత్రలో తొలిసారిగా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాల నుంచి నాయకులు హాజరు కానున్నారు. ఇండియా నుంచి విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హాజరు కానున్నారు. జనవరి 20న యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర దేశాల ప్రతినిధులతో జైశంకర్ సమావేశం అవ్వనున్నారు.
ALSO READ | 2 ఇండియన్ కంపెనీలపై యూఎస్ ఆంక్షలు
ట్రంప్ అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, అర్జెంటీనా జేవియర్ మిలీ తదితర నేతలకు ఆహ్వానం అందింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనరో కూడా హాజరవనున్నట్లు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారనే చర్చ నడుస్తున్నప్పటికీ.. పీఎంఓ దీనిపై స్పందించలేదు.