తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ఉపరితల గాలులు తూర్పు ఈశాన్య దిశలో వీస్తున్నాయి.. . వీటి ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రాగల 3 రోజుల వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చలితో పాటు పొగ మంచు తీవ్రత అధికంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.పొగ మంచు కారణంగా గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రజలు ఉదయాన్నే పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు..
తెల్లవారుజామున ప్రారంభమైన పొగమంచు ఉదయం పదిన్నర గంటల వరకు ఉంటుంది.. ఉదయాన్నే వాకింగ్ చేసే ప్రజలు మంచు ఉండడంతో మాస్క్ ధరించడంతో పాటు సూర్యోదయం అనంతరం చేస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని వైద్యులు సూచిస్తున్నారు.. మార్నింగ్ డ్యూటీలకు వెళ్లే వారు చాలా కష్టాలు పడుతున్నారు.
తెలంగాణలో అత్యధికంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా 11 ఉష్ణోగ్రతలు నమోదయాయి.. సంక్రాంతి సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోవటంతో చలితీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోయారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడంలేదు. . తెలంగాణలో నిన్న (జనవరి 18) చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరోరెండు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది..