EY పూణె ఉద్యోగి మృతిపై.. ఆమె తల్లి రాసిన లేఖ వైరల్..విచారణకు కేంద్రం ఆదేశం

EY పూణె ఉద్యోగి మృతిపై.. ఆమె తల్లి రాసిన లేఖ వైరల్..విచారణకు కేంద్రం ఆదేశం

వర్క్ ప్రెజర్తో 26 యేళ్ల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా పూణె ఉద్యోగి మృతికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. EY పూణె కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఇటీవల చనిపోవడం..తన బిడ్డ మృతికి పని ఒత్తిడే కారణమని ఆమె తల్లి ఆరోపిస్తూ ET కంపెనీ అధినేతకు లేఖ రాసిన లేఖ సోషల్ మీడియాలో  వైరల్ అయింది. 

అన్నా సెబాస్టియన్ తల్లి ET కంపెనీ అధినేతకు రాసిన లేఖపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరందాజ్లే స్పందించారు. కంపెనీ పని ప్రదేశాల్లో సురక్షి త మైన పని వాతావరణ లేదని, ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని మంత్రి శోభా కరందాజ్లే తెలిపారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.