కోటగిరి మండలంలో నేత్రదానం

 కోటగిరి, వెలుగు:  కోటగిరి మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ లీడర్‌‌‌‌ పుల్లెల మోహన్ రావు సతీమణి పుల్లెల కల్యాణి(75) మంగళవారం మృతి చెందింది.

 ఆమె రెండు  కళ్లను కుటుంబసభ్యులు బోధన్ లయన్స్ క్లబ్ ఆస్పత్రికి దానం చేశారు.  కల్యాణి కళ్లను దానం చేసిన మోహన్ రావు, అతని కుమారుడు రమణ, కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ మెంబర్లు అనిల్ కుమార్, జానకీరామ్‌‌, పలువురు అభినందించారు.