Good Health: గుడ్లు.. చేపలు.. క్యారెట్లు తినండి... కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

Good Health:  గుడ్లు.. చేపలు.. క్యారెట్లు తినండి...   కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

కళ్లు... మనకు ఎంత పెద్ద ప్రపంచాన్ని  చూపిస్తాయో, అంత సున్నితమైనవి. మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వాటిలో ముఖ్యమైనవి.  మన గురించి మనం పట్టించు కోనంత ఫాస్ట్ అయిపోయాయి. మన శరీరాన్ని మనం కాపాడుకోకపోతే, ఎంత వేగంగా ముందుకు వెళ్తామో అంతే వేగంగా వెనక్కి పడిపోతాం.  

మనకు చాలా ఇచ్చిన కళ్లకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి వాటిని  లైట్ తీసుకుంటే బాగానే ఇబ్బంది పడాల్సివస్తుంది. ఏ ఉద్యోగం చేయాలో, అవసరాలకు ఎంత.. సంపాదించుకోవాలో, బడ్జెట్​ను ఎలా ప్లాన్​ చేసుకోవాలో... అంటూ మనకి లెక్కలంటాయి. వాటిలో తేడా వస్తే, లైఫ్​ కరాబ్​ అవుతుంది.. అలానే కళ్లకూ కొన్ని లెక్కలుంటాయి. అవి తప్పితే మన హెల్త్ కరాబ్ అవుతుంది. అక్కడి వరకూ రాకుండా మనమే జాగ్రత్త తీసుకోవాలి. కళ్లకు ఏం కావాలో అవన్నీ ఇచేయాలి. అయితే కళ్లేమీ పెద్ద పెద్ద కోరికలు కోరవు. మనకు రెగ్యులర్ గా దొరికి వాటితోనే అవి సరిపెట్టుకుంటాయి.. 

పెరిగిపోయింది... 

ఒకప్పుడు కళ్లకు కళ్లజోడు రావడం అంటేనే విచిత్రమైన విషయం. ఒక పది, పదిహేనేళ్లుగా ఇది చాలా కామన్ అయిపోయింది. కళ్ళజోడు అంటే ఏంటో తెలియకుండా బాల్యాన్ని గడిపిన తరాలు ఇప్పుడు ముసలి వాళ్లు అయిపోయారు. కొన్నేళ్లుగా ఐ సైట్ తోపాటుగా చాలా సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న అల్ట్రా వాయొలెట్ కిరణాల ప్రభావం... ఇవన్నీ కళ్లను ఇబ్బంది పెడుతున్నాయి. ఇది జాగ్రత్తపడాల్సిన సమయం.   అయితే ఇదేమీ పెద్ద టాస్క్ కాదు. మంచి ఆహారాన్ని తీసుకుంటే, చాలా సింపుల్​గా కళ్లను కాపాడుకోవచ్చు. 

కళ్లు బాగుంటే ..గుండె కూడా బాగుంటుంది... 

మన కళ్లకూ గుండెకూ మధ్య చాలా ఒప్పందాలు ఉన్నాయి. కళ్లు బాగుంటే, గుండె కూడా బాగుంటుంది. ఆక్సిజన్ కోసం, పోషకాల కోసం మన కళ్లు చిన్న ధమనులపై ఆధారపడతాయి.. గుండె పెద్ద ధమనుల మీద ఆధారపడుతుంది.కళ్లు బాగుంటేనే వాటి మధ్య నమస్వయం సరిగ్గా కుదురుతుంది. కళ్లను కాపాడుకోవడం ఇలా ఎన్నో రకాలుగా మంచిది. మనకు బాగా దొరికే ఆహారపదార్ధాలతోనే మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.. 

క్యారెట్ 

క్యారెట్ తింటే కళ్లు బాగుంటాయని మనం చిన్నప్పటి నుంచీ వింటున్న మాట. ఇది ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ, దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ మనకి తెలియదు క్యారెట్​ లో  కంటిని కాపాడే చాలా లక్షణాలు ఉన్నాయని సైన్స్ కూడా చెప్తాంది. 
కంటి రెటీనాకు విటమిన్  ఎ బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కళ్లు పొడిబారి పోయే సమస్యను రాకుండా చూసుకుంటుంది. తగినంత తేమను ఉండేలా సాయపడుతుంది. క్యారెట్లో విటమిన్ ..ఎ.. తో పాటుగా విటమిన్.. బి6..  కూడా ఉంటుంది. రెగ్యులర్ క్యారెట్ తీసుకోవడం వల్ల చాలా కంటి సమస్యలను దగ్గరకు కానివ్వకుండా చూసుకోవచ్చు. 

సిట్రస్  పండ్లు 

సిట్రస్​ ఉండే పండ్లు కళ్లకు బాగా ఉపయోగపడతాయి. ఇవి దెబ్బతిన్న కణజాలాలను బాగు చేసేందుకు, కొత్త కణజాలాల పెరుగుదలకూ సాయపడతాయి. ఆరెంజ్, గ్రేప్స్​, లెమన్ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ ..సి...  ఎక్కువగా ఉంటుంది. పీచ్ లోను, టొమాటో లోను విటిమన్..సి బాగానే దొరుకుతుంది. ఇది కళ్లను కాపాడటంలో షేర్ తీసుకుంటుంది. 

గింజలు, విత్తనాలు.... 

దాదాపు అన్ని రకాల గింజల్లోను, విత్తనాల్లోను విటమిన్... ఎ... విటమిన్ ...ఇ... ఎక్కువుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా యాంటీఅక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. కళ్లకు మేలు చేయడంలో మంచి పాత్రనే పోషిస్తాయి. బాదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ....ఇ... ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా కంటిచూపును మెరుగుపరచడంలో కీ'రోల్​ను పోషిస్తాయి. వీటిని పుడ్​ లో  భాగం చేసుకోవడం వల్ల కళ్లకే కాకుండా ఇంకా చాలానే ఉపయోగాలు 

చేప... 


నాన్​ వెజ్​   మొత్తంలో చేప వల్ల కళ్లకి ఎక్కువ ఉపయోగాలున్నాయి. చేపల్లో ఒమేగా3.. ఫాటీ యాసిడ్లతో పాటు, విటమిన్​లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. సాల్మన్, ట్యూనా, సార్డినెస్, హాలిబట్, ట్రౌట్ వంటి చేపల వల్ల ఎక్కువగా ఉపయోగం ఉంటుంది.. కంటిచూపును మెరుగుపరచడంలో ఇవి బాగా సాయపడతాయి నాన్​వెజ్​  తీసుకుంటున్నప్పుడు అందులో చేపలు ఉండేలా చూసుకోవడం బెటర్ ఆప్షన్ 

ఆకుకూరలు.... 

కంటి చూపును మెరుగుపరచడంలో, కళ్లను కాపాడుకోవడంలో ఆకుకూరలే పెద్దన్న పాత్రను పోషిస్తాయి. వీటిలోని యాంటీఅక్సిడెంట్లు కళ్లను కాపాడుకోవడంలో ముందుంటాయి. బచ్చలికూర, పాలకూర, పచ్చిబఠానీలు ఎక్కువ ఉపయోగంగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్ ...ఏ... విటమిన్ ..సి..., ఐరన్ ఉంటాయి. వీటితో కళ్లకే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. 

కోడిగుడ్లు..... 

పాలు, గుడ్లు సంపూర్ణ ఆహారం అని మనం చిన్నప్పటి నుంచీ చదువుకుంటూనే ఉన్నాం. ఎగ్స్​ లో ఒమెగా3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. రోజుకు ఒక గుడ్డును ఫుడ్​ లో భాగం చేసుకోవడం వల్ల చాలానే బాభాలు ఉన్నాయి. కంటి సమస్యలే.. కాకుండా ఇంకా ఎన్నో సమస్యల నుంచి మనల్ని కోడిగుడ్లు కాపాడుతాయి. రెసిస్టెన్స్ పవర్ ను పించడంలోనూ ముందువరుసలోనే ఉంటాయి. 

బీన్స్.... 

బీన్స్ లో  జింక్, రాగి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కళ్లకు చాలా లాభాలు ఉన్నాయి. ఎక్కువ కాంతి నుంచీ, అల్ట్రా వాయొలెట్ కిరణాల నుంచీ కళ్లను కాపాడుకోవడంలో ఇవి ముందుంటాయి. తరచుగా బీన్స్ ను తీసుకోవడం వల్ల కళ్లను కాంతి నుంచి కాపాడుకోవచ్చు. 

ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు  ఉన్నాయి. వాటి అన్నింటిలో ఎక్కువ అద్భుతమైన వాళ్లం మనం. ఈ నేచర్​ లోని ప్రతిఒక్కదాన్నీ చూడగలం. ఆనందించగలం. ఆస్వాదించగలం. మనం ఇంట్లో పెంచుకునే మొక్కనే అపురూపంగా కాపాడుకుంటాం. అలాంటిది. మన శరీరాన్నీ, ఈ ప్రపంచం  మొత్తాన్ని మనకు చూపించే కళ్లను ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఇప్పుడు అందరి జీవితాల్లోనూ  వేగం ఎక్కువైపోయింది.  సో కంటి ఆరోగ్యం గురించి కాస్తంత పట్టించుకోండి.. జీవితాంతకాలం ఆరోగ్యంగా ఉండండి..