జైపూర్:లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకునే హామీలను ప్రకటిస్తోంది. కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ గురువారం (మార్చి 7) యువతకు 5 ఎన్నికల హామీలు ప్రకటించారు. రాజస్థాన్ లో బన్వారాలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో కలిసి యువతపై హామీల ఝల్లు కురిపిం చారు. దేశవ్యాప్తంగా మొత్తం 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు మేం గుర్తించాం.. పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. మొదటి హామీగా ఉద్యోగాల భర్తీపైనే సంతకం ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో 90 శాతం ఉద్యోగాలను నింపుతామని ప్రకటించారు.
రెండో హామీగా ..రైట్ టు అప్రెంటిషిప్..గతంలో కాంగ్రెస్ హయాంలో ఉపాధి హక్కుగా ఉపాధి హామీ పథకం తెచ్చాం..అదే తరహాలో ఇప్పుడు యువతకోసం రైట్ టు అప్రెంటిషిప్ కల్పిస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ప్రతి గ్రాడ్యుయేట్ లేదా డిప్లోమా హెల్డర్ ఈ హక్కుకు అర్హులు అని ప్రకటించారు. ప్రతి గ్రాడ్యుయేట్, డిప్లోమా హోల్డర్ ప్రైవేట్ కంపెనీ లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏడాది పాటు అప్రెంటీస్ షిప్ పొందుతారని దీనికి రూ. 1 లక్ష ఇస్తామని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువతకు సహాయం చేస్తుందన్నారు రాహుల్ గాంధీ.
మూడో హామీగా..పేపర్ లీక్ లు కాకుండా పరీక్షల నిర్వహణకు ప్రామాణికమైన చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ చట్టం కింద ప్రైవేట్ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ ఉండద న్నారు.
ALSO READ :- బెల్లంపల్లి రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే గడ్డం వినోద్
నాల్గో హామీగా రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఆమోదించిన గిగ్ వర్కర్ల చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఈ చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు నిర్దిష్ట హక్కులను కల్పిస్తుందన్నారు. అంటే రాష్ట్రంలో ఉపాధి, నమోదు, సాధారణ నిర్థిష్ట సామాజిక భద్రతా పథకాలకు అందేలా చేస్తుందన్నారు.
ఐదో హామీగా ‘యువ రోష్నీ పథకం’.. ప్రధాని మోదీ ప్రభుత్వం స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాతో కేవలం ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు మాత్రమే లబ్ధి పొందారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యువ రోష్నీ పథకం కింద స్టార్టప్ ఫండ్ రూ. 5వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ నిధి ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంటుందన్నారు.
2022-23 లో తాను చేసిన భారత జోడో యాత్రలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని నిరుద్యోగం, పేపర్ లీక్ ల గురించి యువత తనకు ఫిర్యాదు చేశారని యువత సమస్యలు తీర్చడమే లక్ష్యంగా తాము ముందుకెళతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.