కొండారెడ్డిపల్లిలో 3,500 మందికి కంటి పరీక్షలు

కొండారెడ్డిపల్లిలో 3,500 మందికి కంటి పరీక్షలు

వంగూరు, వెలుగు: మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం తల్లిదండ్రులుఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ జ్ఞాపకార్థం శంకర నేత్రాలయ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 3,500 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 700 మంది కంటి అద్దాలు పంపిణీ చేయగా, 200 మందికి ఆపరేషన్  చేసినట్లు సీఎం సోదరుడు, వీడీసీ చైర్మన్  ఎనుముల కృష్ణారెడ్డి తెలిపారు.

 కంటి చూపుతోబాధ పడుతున్న వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య శిబిరం సక్సెస్​ చేసేందుకు సహకరించిన గ్రామస్తులు, వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. మాజీ ఎంపీటీసీ పులిజాల కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్  ఎనుముల వేమారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాఘవేందర్ యాదవ్, వెంకటయ్య యాదవ్, అనిల్, చందు యాదవ్, వంశీ, రేణయ్య పాల్గొన్నారు.