సిబ్బందికి చెప్పినా ట్రంప్ ను అప్రమత్తం చేయలేదు.. ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు..

సిబ్బందికి చెప్పినా ట్రంప్ ను అప్రమత్తం చేయలేదు.. ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు..

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన ఘటనలో ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తిని చూసినట్లు తెలిపారు. ర్యాలీకి సమీపంలోని బిల్డింగ్ రూఫ్ పై ఓ వ్యక్తి రైఫిల్ తో ఉన్నాడని సీక్రెట్ సర్వీస్ కు చెప్పినట్లు తెలిపారు. అయినా సిబ్బంది ట్రంప్ అప్రమత్తం చేయలేదని, ఆ వెంటనే కాల్పుల శబ్దం వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షి మీడియాతో వెల్లడించారు.

ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతున్న వీడియోను ఎలాన్ మస్క్ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా, ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని కాల్చి చంపేశారు.ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కమలా హారిస్ తదితరులు స్పందించారు. దాడి ఘటనను ఖండించారు.