ఐడియాకి మైండ్ బ్లాక్ : ఒకే వ్యక్తి 2సార్లు చనిపోయి.. రూ.కోటి కాజేశారు

ఐడియాకి మైండ్ బ్లాక్ : ఒకే వ్యక్తి 2సార్లు చనిపోయి.. రూ.కోటి కాజేశారు

వావ్, వారేవ్వా.. ఏ అన్నా ఐడియానా.. ఓ వ్యక్తి రెండు  సంవత్సరాల కాలంలోనే రెండు సార్లు చనిపోయాడు.. షాక్ అయ్యారా? ఇది నిజం ముంభైలో భయాందర్ లో ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయడానికి  కంచన్ రాయ్ అనే మహిళ 2021 అక్టోబర్ 11న కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయినట్లు సృష్టించారు. ఫేక్ డెర్త్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి కంచన్ కుమారుడు ధన్ రాజ్ (30) నామినీగా ఉన్న రూ.20.4లక్షల ఇన్సూరెన్స్ పాలసీ క్లైం చేశారు. 

బీమా కంపెనీ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ తో ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించింది. అదే వ్యక్తికి ఇంకో ఇన్సూరెన్స్ పాలసీతో కొడుకు ధన్ రాజ్ కు రూ.25లక్షలు వచ్చాయి. 2023 అక్టోబర్ 20న పవిత్ర అనే మహిళ చనిపోయిన్లు ఆమె భర్త రోహిత్ (48) నామినీగా ఉన్నా  ఇన్సూరెన్స్ పాలసీ క్లైంకి అప్లై చేశారు. ప్లాన్ వర్కౌంట్ అయ్యింది. 24.2లక్షలు పాలసీ డబ్బును తీసుకున్నారు.

అయితే రెండూ ఇన్సూరెన్స్ కంపెనీల్లో  ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి వివరాలు సేమ్ ఉన్నాయి. కానీ క్లైం చేసిన అడ్రస్, నామినీ వివరాలు ఒకేలా ఉన్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయింది. కంచన్ చనిపోయిన వివరాలను కోరింది. దీంతో అసలు విషయం బయటపడింది. కంచన్ అయియాస్  పవిత్రి అని తేలింది. రెండు మరణానికి క్లైం చేసుకోవాల్సిన రూ.24లక్షలు మరియు రూ.17లక్షలు బిల్లు పెండింగ్ లో ఉంది. 

రెండు వేర్వేరు పాన్ కార్డులను, ఆధార్ కార్డులను ఉపయోగించి మొత్తం రూ.1.1కోటి విలువైన 5 ఇన్సూరెన్స్ పాలసీలను కాజేశాయడానికి వారు ప్లాన్ వేశారు. డాక్టర్ సహాయంతో ఫేక్ డెర్త్ సర్టిఫికేట్లు, ఫొటోగ్రాఫ్ లు, ఫోర్జరీ సంతకాలతో  భారీ స్కెచ్ వేశారు. ఈ కుట్రలో రూ.70లక్షల క్లైం అప్పటికే వారికి ముట్టింది.  బీమా కంపెనీ భయంధర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ముగ్గురిపైన పోలీస్ కేసు పెట్టింది. దీంతో ఫ్యామిలీ మొత్తం పరారీలో ఉంది.