Beauty Tips : కనుబొమ్మలు అందంగా.. పెద్దగా పెరగాలంటే ఇలా చేయండి..!

ఫేస్​ బ్యూటీలో కళ్లు.. కను బొమ్ములు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి.  ఫేస్​ ఎంత ధగ ధగ మెరిసినా.. ఐబ్రోస్​ అందంగా లేకపోతే లోటు లోటుగానే ఉంటుంది.  అందుకే చాలామంది కనుబొమ్మలు అందంగా.. ఆకర్షించేలా ఉండేందుకు ప్రయత్నిస్తారు.  కాని..కొంతమందికి  ... కనుబొమ్మలు అందంగా.. అందమైన, చూడగానే ఆకర్షించే కనుబొమ్మలు అందరికీ ఉండవు. కానీ అలా మీకు ఉండాలంటే..  ఎలాంటి  చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read :- నిగనిగలాడే సౌందర్యానికి హనీ ప్యాక్

రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని.. ఐబ్రోస్ పై గోరువెచ్చని కొబ్బరి నూనె రాసి చేతివేళ్లతో మర్దన చేయండి.... ఆముదం రాస్తే ఐబ్రో త్వరగా పెరుగుతుంది. అయితే ఇలాంటి నూనెలు రాసేటప్పుడు ఐబ్రో పెన్సిల్ ని ఆ  ఆయిల్స్ లో డిప్ చేసి రాస్తుంటే ఐబ్రో ఒత్తుగా పెరగడమే కాకుండా సల్లగా ఉంటాయి.. కొంతమందికి కనుబొమ్మలు ఒత్తుగా ఉంటాయి. అలా లేకుంటే ఖరీదైన ఐబ్రో కిట్​ ను  కొని ఉపయోగిస్తారు. మరి అంత ఖర్చు చేయలేని వాళ్ల పరిస్థితి ఏంటి... అలాంటి వాళ్లకోసమే కనుబొమ్మలు ఒత్తుగా పెరిగేలా చేసే ఈ సీరమ్.

కావాల్సినవి

  • ఆముదం- రెండు టేబుల్ స్పూన్లు
  • కొబ్బరి నూనె - ఒక టీస్పూన్
  •  లావెండర్ ఆయిల్- 4 చుక్కలు

 తయారీ విధానం: చిన్న బాటిల్ లో ఆముదం, కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి. తర్వాత టూత్ బ్రష్ ఆ ఆయిల్లో ముంచి కనుబొమ్మల వెంట్రుకలకు రాయాలి. ఈ ఆయిల్​ ను  రోజుకు రెండు సార్లు రాయాలి. ఆముదంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్ లోని విటమిన్లు, ప్రొటీన్లు వెంట్రుకలు త్వరగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.


- వెలుగు, లైఫ్​–